భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని పోలీస్ స్టేషన్లో గతంలో పోలీసుల ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టులకు భద్రాచలం ఏఎస్పీ రాజేష్ చంద్ర ఆర్థిక సహాయం అందజేశారు.
లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టులకు ఏఎస్పీ ఆర్థిక సాయం - మావోయిస్టుల తాజా సమాచారం
లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టులకు భద్రాచలం ఏఎస్పీ ఆర్థిక సాయం చేశారు. మావోయిస్టులు స్వచ్ఛందంగా పోలీసుల ఎదుట లొంగిపోయిన జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు.
లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టులకు ఏఎస్పీ ఆర్థిక సాయం
శబరి ఏరియా కమిటీ కార్యదర్శి మడకం సన్నీ అలియాస్ రోజాకు నాలుగు లక్షలు, దళ సభ్యుడు శ్యామల మురళికి లక్ష రూపాయల చెక్కులను అందజేశారు. మావోయిస్టులు స్వచ్ఛందంగా పోలీసుల ఎదుట లొంగిపోయిన జనజీవన స్రవంతిలో కలవాలని భద్రాచలం ఏఎస్పీ రాజేష్ చంద్ర విజ్ఞప్తి చేశారు.