భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో తేనెటీగల దాడిలో ఓ దివ్యాంగుడు మృతి చెందాడు. రేగుల బల్లి గ్రామానికి చెందిన జెట్టి సాంబశివరావు(38) కుట్టు పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. శనివారం ఉదయం గ్రామంలోని కృష్ణాలయం వద్ద కూర్చొని గ్రామస్థులతో ముచ్చటిస్తూ ఉండగా, పక్కనే ఉన్న వేప చెట్టు మీద నుంచి తేనెటీగలు ఒక్కసారిగా వారిపై దాడి చేశాయి.
తేనెటీగల దాడిలో దివ్యాంగుడు మృతి - bhadradrikothagudem district news today
తేనెటీగల దాడిలో దివ్యాంగుడు మృతి చెందిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామంలోని కృష్ణాలయం వద్ద కూర్చొని గ్రామస్థులతో ముచ్చటిస్తూ ఉండగా, పక్కనే ఉన్న వేప చెట్టు మీద నుంచి తేనెటీగలు ఒక్కసారిగా వారిపై దాడి చేశాయి.
తేనెటీగల దాడిలో దివ్యాంగుడు మృతి
వారందరూ భయంతో కేకలు వేసుకుంటూ పారిపోగా, సాంబశివరావు దివ్యాంగుడు కావడం వల్ల ఎటూ వెళ్లలేకపోయాడు. అతనిపై తేనెటీగలు దాడి చేశాయి. శరీరం మొత్తం కుట్టడం వల్ల స్పృహ కోల్పోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు వైద్యం కోసం భద్రాచలం ఆస్పత్రికి తరలిస్తుండగా శరీరమంతా విషం వ్యాపించి మృతి చెందాడు.
ఇదీ చూడండి :ఐదుగురు సర్పంచ్ల చెక్‌పవర్ రద్దు చేసిన కలెక్టర్