తెలంగాణ

telangana

ETV Bharat / state

మరమ్మతుల డబ్బులు ఇవ్వలేదట.. అందుకే అదే వాహనం చోరీ - 102 amma vodi latest News

మరమ్మతులు చేసినప్పటికీ డబ్బులు ఇవ్వని కారణంగా అమ్మ ఒడి వాహనాన్నే దొంగలించిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మరమ్మతుల డబ్బులు ఇవ్వలేదట.. అందుకే అదే వాహనం చోరీ
మరమ్మతుల డబ్బులు ఇవ్వలేదట.. అందుకే అదే వాహనం చోరీ

By

Published : Aug 4, 2020, 5:52 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యవసర సేవల నిమిత్తం సేవలందించే ప్రభుత్వ వాహనాన్నే దొంగలు అపహరించారు. మెకానిక్​నంటూ నమ్మబలికి మరమ్మతులు చేస్తామంటూ వాహనంతో ఉడాయించారు.

విచారణలో వెల్లడి

పోలీసులు అప్రమత్తం అవడంతో వాహనం అక్కడే వదిలేసి పరారయ్యాడు. వాహనం మరమ్మతుల డబ్బులు ఇవ్వకపోవడం వల్లే ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ఘటనతో పోలీస్ శాఖ అవాక్కైంది.

అమ్మ ఒడి వాహనం చోరీ...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గల అమ్మఒడి వాహనాన్ని సోమవారం మధ్యాహ్నం దొంగలు అపహరించారు. తాను మెకానిక్​నని.. అత్యవసర సేవలందించే ప్రభుత్వ వాహనాలను రిపేర్ చేస్తుంటానని నమ్మబలికాడు. అనంతరం వాహనాన్ని ట్రయల్ వేయాల్సి ఉంటుందని చెప్పడంతో నమ్మిన డ్రైవర్ దొంగచేతిలో తాళాన్ని పెట్టాడు. ట్రయల్ వేస్తానని చెప్పిన సదరు వ్యక్తి ఎంతకీ తిరిగి రాకపోవడం వల్ల స్థానిక పోలీసులను డ్రైవర్ సంప్రదించాడు. అప్రమత్తమైన పోలీసులు సమీప పోలీస్ స్టేషన్లకు కూడా సమాచారం చేరవేశారు.

రహదారిపైనే వదిలేశారు...

ఇల్లందు, మహబూబాబాద్ రహదారి గుండా 102 వాహనం వెళ్లడాన్ని గమనించిన పోలీసులు... దొంగలను వెంబడించారు. ఈ క్రమంలో ఇల్లందు మండలం రొంపెడు వద్ద పోలీసుల రాకను పసిగట్టిన దొంగ వాహనాన్ని రహదారిపైనే వదిలి ఉడాయించారు. ఈ వాహనం రెండు నెలల క్రితం రిపేరుకు వచ్చిన సందర్భంలో మరమ్మతులు చేసినా డబ్బులు ఇవ్వకుండా తిప్పుతుండటం వల్ల విసిగిపోయిన మెకానిక్ వాహనం ఎత్తుకెళ్ళినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు కోనసాగిస్తున్నారు.

ఇవీ చూడండి : ఉస్మానియాకు సంబంధించిన అన్ని వ్యాజ్యాలు కలిపి విచారిస్తాం: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details