భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రను భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులతో ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అప్రజాస్వామిక పరిపాలనా విధానాలను సాగిస్తున్నారని విమర్శించారు. సచివాలయంలో నుంచి పని చేయాల్సిన ముఖ్యమంత్రి ఫాంహౌస్లో ఉంటూ తనకు కావాల్సిన పత్రాల మీద మాత్రమే దృష్టి కేంద్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ఇంతమంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా... వాటి మీద కనీసం ముఖ్యమంత్రి స్పందించడం లేదన్నారు.
'రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకమైంది' - trs
కొత్తగూడెంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర ప్రారంభించారు. ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణం అని మండిపడ్డారు.
'రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకమైంది'
ప్రజాస్వామ్యాన్ని కోరుకునే నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొని అప్రజాస్వామిక ప్రభుత్వ నిర్ణయాలను ఎండగట్టాలని భట్టి పిలుపునిచ్చారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు, పథకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:బీసీ గురుకులాల్లో కొలువుల పండగ