తెలంగాణ

telangana

ETV Bharat / state

మున్నేరు నది ఒడ్డున సద్దుల బతుకమ్మ వేడుకలు - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాజా వార్తలు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సద్దుల బతుకమ్మ సందడి నెలకొంది. బతుకమ్మకు తుది వీడ్కోలు పలికేందుకు మహిళలు సిద్ధమవుతున్నారు. కానీ సామూహికంగా జరగాల్సిన సంబురాలు కరోనా తీవ్రత దృష్ట్యా నిరాడంబరంగా జరుగుతున్నాయి. సామూహిక వేడుకల్లో మహిళలు పాల్గొనడం లేదు.

bathukamma vedukalu in khammam district
మున్నేరు నది ఒడ్డున సద్దుల బతుకమ్మ వేడుకలు

By

Published : Oct 24, 2020, 2:45 PM IST

Updated : Oct 24, 2020, 3:31 PM IST

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సందడి నెలకొంది. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని గ్రామాలు, పట్టణాల్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. 9 రోజుల పాటు వివిధ రూపాల్లో బతుకమ్మను కొలిచిన మహిళలు.. తుది వీడ్కోలు పలికేందుకు సిద్ధమవుతున్నారు. సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించేందుకు తీరొక్క పూలతో అందమైన బతుకమ్మలను పేరుస్తున్నారు.

కరోనా తీవ్రతతో

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వైభవంగా జరగాల్సిన సద్దుల బతుకమ్మ వేడుకలు నిరాడంబరంగా జరగనున్నాయి. కరోనా వ్యాప్తి తీవ్రత దృష్ట్యా మహిళలు సామూహిక వేడుకల్లో పాల్గొనడం లేదు.

సద్దుల బతుకమ్మతో బతుకమ్మ సంబురాలు ముగియనున్నాయి. ఖమ్మంలోని మున్నేరు ఒడ్డున సాయంత్రం ఈ వేడుకలు జరగనున్నాయి.

ఇదీ చదవండి:మీ "కోటి కొలువులు" ఏమయ్యాయి?: మంత్రి హరీశ్​ రావు

Last Updated : Oct 24, 2020, 3:31 PM IST

ABOUT THE AUTHOR

...view details