భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో ముమ్మరంగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రజాప్రతినిధులు పంపిణీలో పాల్గొంటూ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇల్లందు పట్టణంలోని పలు వార్డుల్లో పురపాలక ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు, వైస్ ఛైర్మన్ జానీ మహిళలకు చీరలను పంపిణీ చేశారు.
ఇల్లందు మండలంలో ముమ్మరంగా బతుకమ్మ చీరల పంపిణీ - బతుకమ్మ చీరల పంపిణీ
ఇల్లందు మండల పరిధిలో బతుకమ్మ చీరల పంపిణీ ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రజాప్రతినిధులు మహిళలకు చీరలను పంపిణీ చేస్తున్నారు.
ఇల్లందు మండలంలో ముమ్మరంగా బతుకమ్మ చీరల పంపిణీ
మండలంలోని 29 గ్రామ పంచాయతీల్లో చీరలను సర్పంచులు, ఎంపీటీసీలు పంపిణీ చేస్తున్నారు. ఇల్లందు రూరల్ పరిధిలో 20,686, ఇల్లందు పట్టణ పరిధిలో 10,119 చీరలను పంపిణీ చేయనున్నట్టు తహసీల్దార్ మస్తాన్ రావు తెలిపారు.
ఇవీ చూడండి: వ్యక్తి నమూనాతో కేక్ తయారు.. మీరెప్పుడైనా చూశారా?