తెలంగాణ

telangana

ETV Bharat / state

భద్రాద్రి డీఎంహెచ్​వో మృతి బాధాకరం : బండి సంజయ్ - తెలంగాణ ప్రభుత్వ తీరుపై మండిపడ్డ బండి సంజయ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన డిప్యూటీ డీఎంహెచ్​ అధికారి నరేష్​కుమార్ కరోనాతో మృతి చెందడం.. తనను తీవ్రంగా కలచివేసిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బాధపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ప్రైవేట్ ఆసుపత్రులను నియంత్రణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

bandi fire on bhadradri dmho death due to corona
'భద్రాద్రి డీఎంహెచ్​వో కరోనాతో మరణించడం బాధాకరం'

By

Published : Aug 10, 2020, 12:48 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన డిప్యూటీ డీఎంహెచ్​ అధికారి నరేష్​కుమార్ కరోనాతో మృతి చెందడం.. తనను తీవ్రంగా కలచివేసిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ అన్నారు. జిల్లా వైద్యాధికారికి కూడా సరైన వైద్యం అందించలేకపోవడం చాలా దురదృష్టకరమని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యాధికారి కుటుంబాన్ని యశోదా ఆసుపత్రిలో రూ. లక్షల బిల్లులు చెల్లించమని వేధించడం హేయమైన చర్యగా ఒక ప్రకటనలో ఆయన అభివర్ణించారు.

'భద్రాద్రి డీఎంహెచ్​వో కరోనాతో మరణించడం బాధాకరం'

ప్రజలకు కరోనా నుంచి కాపాడడానికి ప్రాణత్యాగం చేసిన నరేష్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం అందించే రూ. 50 లక్షల బీమాకు తోడుగా రాష్ట్ర ప్రభుత్వం రూ. కోటి ఎక్స్​గ్రేషియా చెల్లించాలని బండి సంజయ్ కోరారు. నరేష్​కుమార్ భార్యకు గ్రూప్-1 స్థాయి ప్రభుత్వం ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని.. ప్రైవేట్ ఆసుపత్రులను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకొచ్చి బిల్లులకు కట్టడి చేసి ప్రజలకు భరోసా కల్పించాలని కోరారు.

ఇదీ చదవండి:కాంగ్రెస్​ వర్గీయుల బాహాబాహీ.. ఒకరిపై ఒకరి కేసులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details