మహబూబాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకలో ప్రచార కార్యాలయాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే రేగా కాంతారావు నమ్మిన ఓటర్లను మోసం చేశాడని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మండల నాయకులకు, ఎమ్మెల్యేలకు పార్టీ అధిష్ఠానం షోకాజ్ నోటీసులు జారీ చేసిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పినపాక నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కొత్త కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
కాంగ్రెస్ను కాంతారావు మోసం చేశారు: బలరాం నాయక్ - mahabubabad
పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు నమ్మిన ఓటర్లను మోసం చేశాడని కాంగ్రెస్ నేత బలరాం నాయక్ ఆరోపించారు. కాంగ్రెస్ అన్ని అవకాశాలు కల్పించిందని చివరికి పార్టీని వీడడం సరైంది కాదన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకలో బలరాం నాయక్ ప్రచార కార్యాలయాన్ని ప్రారంభించారు.
Breaking News