మాతాశిశు మరణాలు తగ్గించడానికి నిర్వహిస్తున్న కార్యక్రమంతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఉందని యువతకు సూచించారు. వైద్యం అందక ఏ ఒక్క ప్రాణం పోవడానికి వీల్లేకుండా అందరూ వైద్య సైనికుల్లా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆరోగ్య కార్యకర్తలకు కిట్లను ప్రదానం చేశారు. శిక్షణ పూర్తయిన యువతీ యువకులు ఆదివాసీల నృత్యాన్ని ప్రదర్శించగా... వారితో కలిసి కలెక్టర్ కాలు కదిపారు. అందరితో పాటు నృత్యం చేసి యువతలో ఉత్సాహాన్ని నింపారు.
Badradri Collector: విద్యార్థులతో కలిసి నృత్యం చేసిన భద్రాద్రి కలెక్టర్.. - badradri kothagudem collector dance with students in badrachalam
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్.. విద్యార్థులతో కలిసి నృత్యం చేశారు. భద్రాచలంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్.. సామాజిక ఆరోగ్య కార్యకర్తల శిక్షణా కార్యక్రమాన్ని పరిశీలించారు. విద్యార్థులు ప్రదర్శించిన ఆదివాసీల నృత్యంలో తానూ కాలు కదిపారు.
![Badradri Collector: విద్యార్థులతో కలిసి నృత్యం చేసిన భద్రాద్రి కలెక్టర్.. badradri kothagudem collector anudeep dance with students in badrachalam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12774438-728-12774438-1628958016601.jpg)
badradri kothagudem collector anudeep dance with students in badrachalam
విద్యార్థులతో కలిసి నృత్యం చేసిన భద్రాద్రి కలెక్టర్..
TAGGED:
Badradri Collector anudeep