లాక్‌డౌన్ పొడిగించిన నేపథ్యంలో వచ్చిన వలస కూలీలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని భద్రాద్రి జిల్లా భాజపా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ కోరారు. పాపకొల్లు పరిసర ప్రాంతాల్లో ఉంటున్న వలస కూలీలతో మాట్లాడి వారి ఇబ్బందులు తెలుసుకున్నారు.
పాపకొల్లులో వలస కార్మికులకు నిత్యావసరాల పంపిణి - వలస కార్మికులు
పాపకొల్లు పరిసర ప్రాంతాల్లో ఉంటున్న 300 మంది వలస కూలీలకు భాజపా మండల కమిటీ ద్వారా బియ్యం, కూరగాయలు అందజేశారు. వారి సమస్యలను భద్రాద్రి జిల్లా భాజపా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ అడిగి తెలుసుకున్నారు.
పాపకొల్లులో వలస కార్మికులకు నిత్యావసరాల పంపిణి
తమకు బియ్యం, నగదు రాలేదని వలస కార్మికులు తెలిపారు. ఎండలకు తాము ఉండలేక పోతున్నామని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ రాష్ట్రాలకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం కల్పించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం సూచించిన విధంగా వలస కూలీలందరికీ ప్రభుత్వం బియ్యం నగదు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పార్టీ మండల కమిటీ ద్వారా 300 మందికి బియ్యం, కూరగాయలు అందజేశారు.
ఇదీ చదవండి:మనమరాలికి కిడ్నీ సమస్య..యాచకుడిగా మారిన తాత