భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో కలెక్టర్ ఎంవీ రెడ్డి పర్యటించారు. ఈ నెల 10 న నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ అశ్వాపురంలో నిర్మిస్తోన్న సీతారామసాగర్ ప్రాజెక్ట్ సందర్శించనున్నారు. ఉన్నతాధికారుల పర్యటన నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను ప్రభుత్వ విప్ రేగా కాంతారావుతో కలిసి కలెక్టర్ పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.
సీతారామ ప్రాజెక్టు పనులను పరిశీలించిన కలెక్టర్, విప్ - సీతారామసాగర్ ప్రాజెక్టు వార్తలు
ఈ నెల 10న భద్రాద్రి జిల్లాలోని అశ్వాపురంలో నిర్మిస్తోన్న సీతారామసాగర్ ప్రాజెక్టును నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ సందర్శించున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను ప్రభుత్వ విప్ రేగా కాంతారావుతో కలిసి కలెక్టర్ ఎంవీ రెడ్డి పర్యటించారు. సీతారామ ప్రాజెక్టు మొదటి పంపుహౌస్‌ను పరిశీలించారు.
badradri collector
ఉన్నతాధికారులు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా రానున్న నేపథ్యంలో మణుగూరు, అశ్వాపురంలోని హెలిప్యాడ్లను పరిశీలించారు. అనంతరం సీతారామ ప్రాజెక్టు మొదటి పంపుహౌస్‌ను పరిశీలించారు.
ఇదీ చదవండి :పద్మారావుకు కరోనాపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు