భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని రాజీవ్‌నగర్ కాలనీలో మద్యం దుకాణాల వద్ద కాలనీవాసులు ఆందోళనకు దిగారు. రెండేళ్ల నుంచి జనావాసాల్లో, ఆలయ పరిసర ప్రాంతాల్లో మద్యం దుకాణాలు నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'మద్యం దుకాణాలు ఊరికి దూరంగా పెట్టండి'
జనావాసాల్లో, ఆలయ పరిసరాల్లో నడుపుతున్న మద్యం దుకాణాలను ఎత్తివేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని రాజీవ్‌నగర్ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు.
భద్రాచలంలో మద్యం దుకాణాలపై ఆందోళన
వెంటనే ఇక్కడి మద్యం దుకాణాలను ఎత్తివేయాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. జనావాసాల్లోని మద్యం దుకాణాలు తీసివేసి ఊరికి దూరంగా ఏర్పాటు చేసేంతవరకు నిరసన చేస్తూనే ఉంటామని కాలనీవాసులు తెలిపారు.