భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని వివిధ కాలనీల్లో జరుగుతున్న ధరణి సర్వేను జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. స్థానిక అధికారులు సర్వేలు జాప్యం చేస్తున్నారని... తొందరగా పూర్తి చేయాలని మండిపడ్డారు. అనంతరం భద్రాచలంలోని గ్రామపంచాయతీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు.
ధరణి సర్వేను వేగవంతం చేయాలి: కలెక్టర్ ఎంవీ రెడ్డి - collector visit to badrachalam
భద్రాచలంలో జరుగుతున్న ధరణి సర్వేను జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. సర్వేను జాప్యం చేస్తున్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలు త్వరగా సేకరించాలని ఆదేశించారు.
badrachalam collector sudden visit on dharani survey
పంచాయతీ కార్యాలయంలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఒక అటెండర్‌ను విధుల నుంచి తొలగించారు. పంచాయతీ కార్యాలయం వద్దకు వచ్చిన ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకునే క్రమంలో నిర్లక్ష్యం వహించినందుకు అటెండర్ రమేశ్‌ను విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు. స్థానిక అధికారులంతా సర్వేను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.