భద్రాచలం వద్ద దుకాణాల్లోకి చేరిన వరదనీరు - backwater at badradri rama temple
బ్యాక్‌వాటర్‌ను ఎత్తిపోసే మోటార్లు మొరాయించడం వల్ల భద్రాద్రి రామాలయ అన్నదాన సత్రం వద్ద మోకాళ్లలోతు నీరు నిలిచింది. బ్యాక్ వాటర్ చేరికతో అధికారులు దుకాణాలన్నింటినీ ఖాళీ చేయిస్తున్నారు. బ్యాక్‌వాటర్‌ను గోదావరిలోకి ఎత్తిపోసేందుకు సిబ్బంది యత్నిస్తున్నారు.

దానసత్రం వద్ద మోకాళ్ల లోతుకు చేరిన బ్యాక్‌వాటర్
భద్రాచలం వద్ద దుకాణాల్లోకి చేరిన వరదనీరు
భద్రాచలం వద్ద గోదావరిలో నీటిమట్టం 48 అడుగులకు చేరింది. అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యాక్‌వాటర్ బయటకు పంపించే మోటార్లు పాడవడం వల్ల రామాలయ అన్నదాన సత్రం వద్ద మోకాళ్ల లోతు వరకు నీరు చేరింది. దుకాణదారులు వారి దుకాణాలు మూసివేశారు. లోతట్టు ప్రాంతాల వారిని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. అన్నదాన సత్రం వద్ద దుకాణాలను ఖాళీ చేయిస్తున్నారు. నదీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
- ఇదీ చూడండి : పొలం పనులకు వెళ్లి వాగులో చిక్కుకున్నారు
Last Updated : Aug 9, 2019, 11:42 AM IST