తెలంగాణ

telangana

ETV Bharat / state

పసిపాపను గోతిలో పాతిపెట్టారు.. పశువుల కాపరులు కాపాడారు! - పసిపాపను కాపాడిన పశువుల కాపరులు

అప్పుడే పుట్టిన పసిపాపను గొయ్యి తీసి అందులో పాతిపెట్టిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తూర్పుగోదావరి సరిహద్దు ప్రాంతంలో చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు చెరువు పక్కన గోతిలో పాతిపెట్టి పరారయ్యారు. శిశువును గమనించిన పశువుల కాపరులు భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Baby Boy Found Near Pound.. Shifted To Bhadrachalam Area Hospital
పసిపాపను గోతిలో పాతిపెట్టారు.. పశువుల కాపరులు కాపాడారు!

By

Published : Sep 5, 2020, 8:36 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తూర్పు గోదావరి జిల్లా సరిహద్దుల్లో దారుణం చోటు చేసుకుంది. భద్రాచలం సరిహద్దులోని ఎటపాక మండలం కృష్ణవరం గ్రామ శివారులోని చెరువు పక్కన అప్పుడే పుట్టిన మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు పాతిపెట్టి పారిపోయారు. అదే సమయంలో అటుగా వెళ్లిన పశువుల కాపరులు చిన్నారి ఏడుపులు విని భూమిని తవ్వి చూశారు. గోతిలో మగ శిశువు కనిపించగా.. వెంటనే స్థానికులకు సమాచారం అందించారు. శిశువుకు స్థానిక లక్ష్మీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స చేసి.. మెరుగైన వైద్యం కోసం.. భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పుడే పుట్టిన పసికందును పాతిపెట్టడానికి మనసెలా ఒప్పిందంటూ.. స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పసిపాను చూసిన కొంతమంది ముక్కు పచ్చలారని పసిబిడ్డను భూమిలో పాతిపెట్టడానికి చేతులెలా వచ్చాయంటూ కన్నీరు పెట్టుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details