తెలంగాణ

telangana

ETV Bharat / state

corona: నిబంధనలు పాటించని పెళ్లిళ్లపై అధికారుల కొరడా - తెలంగాణ వార్తలు

కరోనా నిబంధనలు పాటించని వివాహాలపై అధికారులు చర్యలు చేపట్టారు. పెళ్లి వేడుకలో ఎక్కువమంది హాజరు కావడం వల్ల నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతులు లేకుండా జరుపుతున్న కార్యక్రమాలను అడ్డుకుంటున్నారు.

corona, functions in covid death
కరోనా వేళ పెళ్లిళ్లు, కొవిడ్ వేళ కార్యక్రమాల అనుమతులు

By

Published : Jun 5, 2021, 3:13 PM IST

కొవిడ్ నిబంధనలు పాటించని వివాహాలపై అధికారులు కొరడా ఝలిపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో కొవిడ్ నిబంధనలు పాటించకుండా, ఎటువంటి అనుమతులు తీసుకోకుండా జరుగుతున్న కార్యక్రమాలను అడ్డుకున్నారు. తహసీల్దార్ శ్రీనివాసరావు, సీఐ రాజు ఆధ్వర్యంలో 45 మందిపై కేసు నమోదు చేశారు.

పెళ్లి వేడుకలో ఎక్కువమంది హాజరు కావడం వల్ల నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా విందులు వాయిదా వేసుకోవాలని సూచించారు. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:Online Loan Apps : ఎస్సైనని బెదిరించి ఖాతా ఖల్లాస్

ABOUT THE AUTHOR

...view details