భద్రాద్రి దేవాలయంపై కొంత మంది వ్యక్తులు దురుద్దేశ పూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని దేవాలయ ఆగమ పురాణ సంరక్షణ సమితి ఆరోపించింది. సంబంధం లేని వ్యక్తులు చేసే ఆరోపణలపై తెలంగాణ దేవాదాయ శాఖ తక్షణం స్పందించి... వారిపై చర్యలు తీసుకోవాలని సమితి కన్వీనర్ గంగు ఉపేంద్ర శర్మ హైదరాబాద్‌లో డిమాండ్ చేశారు. శ్రీరాముల వారిని రామనారాయణ అనడం ... సీతమ్మ వారిని సీతామహాలక్ష్మి అనడం తప్పేమి కాదన్నారు. ఈ విషయంలో సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే దీనిపై ఒక పుస్తకం ప్రచురించి... భక్తులలో విశ్వాసం దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని వారు ధ్వజమెత్తారు.
'భద్రాద్రి ఆలయంపై దుష్ప్రచారం చేసేవారిపై చర్యలు తీసుకోవాలి' - భద్రాద్రి రామాలయం
కొందరు భద్రాద్రి దేవాలయంపై దుష్ప్రచారం చేస్తున్నారని దేవాలయ ఆగమ పురాణ సంరక్షణ సమితి కన్వీనర్ గంగు ఉపేంద్ర శర్మ ఆరోపించారు. వారిపై తెలంగాణ దేవాదాయ శాఖ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
'భద్రాద్రి ఆలయంపై దుష్ప్రచారం చేసేవారిపై చర్యలు తీసుకోవాలి'
భద్రాద్రి ఆలయంలో గత 350 ఏళ్లుగా ఆగమ శాస్త్ర నియమ, నిబంధనల ప్రకారమే నిత్య పూజ , కైంకర్యాలు జరుగుతున్నాయని ... ఇదే తరహాలో అన్ని హిందూ దేవాలయాల్లో జరుగుతున్నాయని పేర్కొన్నారు. అన్నదమ్ముల వలే కలిసి మెలిసి ఉన్న స్మార్త , వైష్ణవుల మధ్య ఘర్షణలు రేపే విధంగా పని చేస్తున్నారని... ఇటువంటి వారిపై దేవాదాయ శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్‌రావు