భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సకల సద్గుణాలు కలిగిన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిని కీర్తిస్తూ కరోనా కష్టాల నుంచి ఆదుకోవాలని పూజించారు. మహమ్మారి నుంచి అందర్నీ గట్టెక్కించాలని అర్చకులు ఆపదుద్దారక స్తోత్రాన్ని పారాయణం చేశారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని... 27 రోజుల పాటు అపదుద్దారక పారాయణానికి శ్రీకారం చుట్టారు.
Bhadradri: రామయ్యా..కరోనా నుంచి కాపాడు స్వామి - apaduddharaka stotram prayanam
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి తొలగిపోవాలని... ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని భద్రాద్రి ఆలయ అధికారులు 27 రోజులు పాటు అపదుద్దారక స్తోత్రం పారాయణానికి శ్రీకారం చుట్టారు. నేడు ఆరవ రోజు సందర్భంగా ఆలయంలోని బేడా మండపంలో స్వామివారి ఎదురట పారాయణం చేశారు.
ఈ నెల 13న ప్రారంభమైన ఈ కార్యక్రమం జులై 9వ తేదీ వరకు కొనసాగనుంది. ఆరవ రోజైన నేడు అదుద్ధారక స్తోత్రాన్ని ఆలయంలోని బేడా మండపంలో స్వామివారి ఎదుట పారాయణం చేశారు. 20వ తేదీన చిత్తా నక్షత్రం సందర్భంగా యాగశాలలో సుదర్శన హోమం ఉంటుందని... 21న సర్వ ఏకాదశిని పురస్కరించుకుని పవళింపును చేయడం లేదని అర్చకులు తెలిపారు. అదే రోజు శ్రీపెరియాళ్వార్ తిరునక్షత్ర ఉత్సవం సందర్భంగా విశేష భోగ నివేదన చేయనున్నారు. జ్యేష్ఠాభిషేకం పూజలకు 23న అంకురార్పణ చేసి 24న అభిషేకం నిర్వహించనున్నారు.
ఇదీ చూడండి:రోజు విడిచి రోజు నీరు.. నేటి నుంచి సరఫరా