సింగరేణి ఉద్యోగులు, కార్మికులందరికీ సీఎండీ శ్రీధర్ శుభాకాంక్షలు తెలిపారు. సంస్థ లక్ష్యాలు సాధిస్తున్న కార్మికులందరికీ అభినందనలు చెప్పిన ఆయన... బొగ్గుతో పాటు థర్మల్, సౌర విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న ఏకైక సంస్థ సింగరేణి అని స్పష్టం చేశారు. సమష్టి కృషితో సింగరేణికి మరో వందేళ్ల సుస్థిర భవిష్యత్ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కష్టాలను ఎదుర్కొని విజయం సాధించడం సింగరేణికి అలవాటే. రానున్న రోజుల్లో ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా బలంగా ఎదుర్కొని ముందుకు వెళ్లే సత్తా సింగరేణికి ఉంది. బొగ్గుతో పాటు థర్మల్, సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న ఏకైక ప్రభుత్వ బొగ్గు సంస్థ సింగరేణి మాత్రమే.