తెలంగాణ

telangana

ETV Bharat / state

మరోసారి సేవాగుణాన్ని చాటిన అన్నం శ్రీనివాసరావు

ఎందరో అభాగ్యులను చేరదీసి అక్కున చేర్చుకున్న ఆయన మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. మతిస్థిమితం లేక రోడ్లపై తిరుగుతున్న ఎంతో మందిని చేరదీసి వారికి ఆశ్రయం కల్పించారు. కరోనా సమయంలో ఎంతో మందికి ఆ నలుగురిగా మారి అంత్యక్రియలు నిర్వహించారు. తాజాగా మరోసారి తమ సేవాగుణాన్ని చాటుకున్నారు అన్నం ఫౌండేషన్ సభ్యులు అన్నం శ్రీనివాస రావు. ఆంగ్లం మాట్లాడుతూ... రోడ్లపై తిరుగుతున్న ఓ మహిళను స్వయంగా వచ్చి వారి ఆశ్రమానికి తీసుకెళ్లారు.

By

Published : Nov 6, 2020, 12:54 PM IST

annam foundation gave Shelter to unknown a  woman
మరోసారి సేవాగుణాన్ని చాటిన అన్నం శ్రీనివాసరావు

అభాగ్యులు, మతిస్థిమితం లేనివారు, అనాధలు, వృద్ధులను చేరదీస్తున్న అన్నం ఫౌండేషన్ మరోసారి తమ సేవా గుణాన్ని చాటుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మతిస్థిమితం లేకుండా తిరుగుతున్న ఓ మహిళను చేరదీసి అన్నం శ్రీనివాసరావు తన సేవా గుణాన్ని చాటుకున్నారు. మండలంలోని బొజ్జ గూడెం పంచాయతీలలో రోడ్లపై తిరుగుతున్న మహిళను గమనించిన స్థానికులు వారి దృష్టికి తీసుకెళ్లడంతో... ఆయనే స్వయంగా వచ్చి మహిళను ఆశ్రమానికి తీసుకెళ్లారు.

ఆ మహిళ కొంతకాలంగా అక్కడే తిరుగుతోందని... అప్పుడప్పుడు ఆంగ్లంలో మాట్లాడుతుందని స్థానికులు తెలిపారు. కరోనా కష్టకాలంలో కుటుంబ సభ్యులే వెనుకడుగేసిన సమయంలో కొవిడ్ మృతులకు అంత్యక్రియలు నిర్వహించి అన్నం ఫౌండేషన్ సభ్యులు మానవత్వం చాటుకున్నారు.

ఇదీ చదవండి:అధిక వడ్డీల పేరుతో రూ. 2 కోట్లు మోసం.. ముగ్గురు అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details