భద్రాచలంలో కరోనాతో వృద్ధుడు మృతి - old man died in bhadrachalam
భద్రాద్రి జిల్లాలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. వైరస్ బారిన పడి ఇవాళ ఓ వృద్ధుడు ప్రాణాలొదిలాడు. అధికారులు అంత్యక్రియలు నిర్వహించారు.
![భద్రాచలంలో కరోనాతో వృద్ధుడు మృతి భద్రాచలంలో కరోనాతో వృద్ధుడు మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8423044-433-8423044-1597421541921.jpg)
భద్రాచలంలో కరోనాతో వృద్ధుడు మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఓ వృద్ధుడు కరోనాతో మృతిచెందాడు. భద్రాచలంలోని అశోక్ నగర్ కాలనీకి చెందిన ఓ వృద్ధుడు.. పది రోజుల క్రితం ఏరియా ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ నిర్ధరణ అయింది. ఇవాళ ఉదయం మృతి చెందాడు. తహశీల్దార్ నాగేశ్వరరావు, గ్రామ పంచాయతీ ఈఓ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.