భద్రాద్రి: సంప్రోక్షణ పూర్తి.. భక్తులకు ప్రవేశం - సంప్రోక్షణ అనంతరం భక్తులకు అనుమతి
సూర్యగ్రహణం అనంతరం భద్రాద్రి రామయ్య ఆలయంలో సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించి భక్తులను ఆలయంలోనికి అనుమతించారు.
సంప్రోక్షణ అనంతరం భక్తులకు అనుమతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి ఆలయాన్ని తిరిగి తెరిచారు. సూర్యగ్రహణం పూర్తయ్యాక ఆలయ శుద్ధి చేసి గోదావరి నీటితో సంప్రోక్షణ చేశారు. ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములకు పంచామృతాలతో అభిషేకం చేశారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి భక్తులను దర్శనాలకు అనుమతిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు విజయ రాఘవులు తెలిపారు.