తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి: ఏఐకేఎస్​సీసీ

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఏఐకేఎస్​సీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షలకు అఖిలపక్ష నాయకులు సంఘీభావం ప్రకటించారు. నెల రోజుల నుంచి రైతులు ఉద్యమం చేస్తున్నా.. ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

all party leaders participated in formers protest at bhadradri kothagudem
రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి: ఏఐకేఎస్​సీసీ

By

Published : Jan 3, 2021, 2:29 PM IST

వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ దిల్లీ సరిహద్దుల్లో దీక్ష చేస్తోన్న రైతుల పట్ల కేంద్ర వైఖరిని అఖిల భారత రైతు సంఘ నాయకులు ఖండించారు. రైతులకు నష్టం చేకూర్చేలా ఉన్న మూడు చట్టాలతోపాటు విద్యుత్​ బిల్లునూ ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఏఐకేఎస్​సీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షలకు అఖిలపక్ష నాయకులు సంఘీభావం తెలిపారు.

దేశానికి అన్నం పెట్టే రైతు చేస్తున్న దీక్షపై కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించడం తగదన్నారు. న్యాయమైన తమ డిమాండ్ల కోసం కోటి ఇరవై లక్షల మంది రైతులు ఉద్యమం చేస్తున్నా.. ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, సీపీఐ, సీపీఎం రైతు సంఘాల నాయకులు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, ఏపూరి బ్రహ్మం, సీతారామయ్య, నాగయ్య, కృష్ణ, కిరణ్, నాగేశ్వర రావు, చంద్ర, అరుణ పాల్గొన్నారు.

ఇదీ చూడండి: 'టెలికాలర్స్ ఒత్తిడితోనే చంద్రమోహన్ ఆత్మహత్య'

ABOUT THE AUTHOR

...view details