తెలంగాణ

telangana

Bhadrachalam Bandh: భద్రాచలం నియోజకవర్గ బంద్‌కు అఖిలపక్షం పిలుపు

By

Published : Feb 10, 2022, 11:41 AM IST

Bhadrachalam Bandh:ఏపీలో కలిపిన 5 పంచాయతీలు తిరిగి భద్రాచలంలో చేర్చాలని డిమాండ్‌ చేస్తూ అఖిలపక్ష నేతలు పట్టణ బంద్ చేపట్టారు. భద్రాచలం నుంచి వెళ్లే అన్ని ఆర్టీసీ సర్వీసులను నిలిపివేశారు. అన్ని ప్రభుత్వ ప్రైవేటు వ్యాపార సంస్థలను, విద్యా సంస్థలను బంద్ చేయించారు.

Bhadrachalam Bandh: భద్రాచలం నియోజకవర్గ బంద్‌కు అఖిలపక్షం పిలుపు
Bhadrachalam Bandh: భద్రాచలం నియోజకవర్గ బంద్‌కు అఖిలపక్షం పిలుపు

Bhadrachalam Bandh: రాష్ట్ర విభజనలో భద్రాచలంలో ఉన్న ఐదు పంచాయతీలను ఆంధ్రప్రదేశ్​లో కలపడం వల్ల భద్రాచలం నియోజకవర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని అఖిలపక్ష నేతలు ఆందోళన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ లో కలిపిన అయిదు పంచాయతీలను తిరిగి తెలంగాణలోని భద్రాచలంలో కలపాలని భద్రాచలం నియోజకవర్గ బంద్ పాటిస్తున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఈరోజు ఉదయం నుంచి అఖిలపక్ష రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలు భద్రాచలంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు. భద్రాచలం నుంచి వెళ్లే అన్ని ఆర్టీసీ సర్వీసులను నిలిపివేశారు. అన్ని ప్రభుత్వ ప్రైవేటు వ్యాపార సంస్థలను, విద్యా సంస్థలను బంద్ చేయించారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భద్రాచలం అభివృద్ధిపై నిర్ణయం తీసుకొని ఐదు పంచాయితీలను తిరిగి భద్రాచలంలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details