తెలంగాణ

telangana

ETV Bharat / state

రాములోరి కల్యాణానికి పూర్తైన ఏర్పాట్లు

భద్రాద్రి పుణ్యక్షేత్రంలో కొలువైన సీతారాముల కల్యాణానికి భద్రాద్రి క్షేత్రం సుందరంగా ముస్తాబైంది. వసంతపక్ష తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల మధ్య చైత్రమాస అభిజిత్ లఘ్నమున సీతారాములకు కల్యాణ మహోత్సవం జరగనుంది.

r bhadradri sri rama kalyanam
r bhadradri sri rama kalyanam

By

Published : Apr 20, 2021, 7:54 PM IST

Updated : Apr 20, 2021, 10:42 PM IST

రాములోరి కల్యాణానికి భద్రాద్రి పుణ్యక్షేత్రం సుందరంగా ముస్తాబైంది. వసంతపక్ష తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల మధ్య... చైత్రమాస అభిజిత్ లఘ్నమున సీతారాములకు కల్యాణ మహోత్సవం జరగనుంది. ఏటా భక్తుల జయజయధ్వానాలు, శ్రీరామనామస్మరణ మధ్య వైభవోపేతంగా సాగే కల్యాణ వేడుక.. వరుసగా రెండో ఏడాది కూడా అత్యంత నిరాడంబరంగా సాగనుంది.

కరోనా మహమ్మారి దెబ్బతో... భక్తుల సందడి లేకుండానే... రాములోరి కల్యాణం జరగనుంది. ఏటా మిథిలా మైదానంలో నిర్వహించే రాములోరి కల్యాణ వేడుక... వరసగా రెండో ఏడాది బేడా మండపంలోనే నిర్వహిస్తున్నారు. ఫలితంగా సీతారాముల వారి కల్యాణాన్ని ప్రత్యక్షంగా చూసి తరించాలని వేయికళ్లతో ఎదురుచూస్తున్న భక్త కోటికి నిరాశే మిగలింది. టీవీల ద్వారా వీక్షించేలా... భద్రాద్రి ఆలయం నుంచి ప్రత్యక్ష ప్రసారం అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

ఇదీ చూడండి:భద్రాచలంలో రామరథాన్ని ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి

Last Updated : Apr 20, 2021, 10:42 PM IST

ABOUT THE AUTHOR

...view details