భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో సింగరేణి ఏఐటీయూసీ వందేళ్ల ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది. ఇల్లెందు జీకే ఉపరితల గనిలో ఏఐటీయూసీ ఆవిర్భావ వేడుకలో ముఖ్యనేతలు వాసిరెడ్డి సీతారామయ్య, గట్టయ్య, శేషయ్య జెండాను ఆవిష్కరించారు. కార్మిక సంఘం సింగరేణి కోల్ బెల్ట్ ఏరియాలలో బొగ్గుగనుల బావిజాత కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఏఐటీయూసీ వందేళ్ల వైభవం.. సింగరేణిలో సంబురం - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాాజా సమాచారం
సింగరేణిలో ఏఐటీయూసీ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో కార్మికసంఘం ముఖ్యనేతలు జెండాను ఆవిష్కరించారు. అనంతరం పట్టణంలో ద్విచక్ర వాహనాలతో ర్యాలీని చేపట్టారు.

వందేళ్లు పూర్తి చేసుకున్న సింగరేణి కార్మికసంఘం
ఇల్లెందు పట్టణంలోని పాతబస్టాండ్‌లోని యూనియన్ నాయకుడు కొమురయ్య విగ్రహం వద్దకు ద్విచక్రవాహనాలతో ర్యాలీ చేపట్టారు. కార్మిక సంఘం పోరాటంతోనే కరోనా పరీక్షలు నిర్వహించారని తెలిపారు. తమ ధర్నాలతో యాజమాన్యం దిగివచ్చి, కార్మికులకు అన్ని రకాల వైద్య సదుపాయాలు కల్పించిందని నాయకులు వెల్లడించారు.