సింగరేణి కార్మికుల మార్చి జీతం నుంచి మినహాయించిన 50 శాతం వేతనాన్ని తక్షణమే చెల్లించాలని ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యులు కె.సారయ్య తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ముఖ్య నాయకులతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. మార్చి 23 నుంచి ఏప్రిల్ 1 మధ్య కాలంలో సెలవుల్లో ఉండి తిరిగి విధులకు హాజరైన కార్మికులకు లే ఆఫ్ మస్టర్ జీతాన్ని చెల్లించాలని కోరారు.
'సింగరేణి కార్మికులకు మినహాయింపు జీతం ఇవ్వాలి' - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు తాజా వార్తలు
సింగరేణి కార్మికులకు మినహాయించిన వేతనాన్ని తక్షణమే చెల్లించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు.
'సింగరేణి కార్మికులకు మినహాయింపు జీతం ఇవ్వాలి'
ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఉపరితల గనుల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు షిఫ్ట్ పని వేళల్లో మార్పు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు ఎండీ నజీర్ అహ్మద్, ఫిట్ కార్యదర్శులు అబ్దుల్లా, నూనె శ్రీనివాస్, సుందర్ తురాయి, సతీష్, మోజేస్, వేంకటేశ్వర్లు, జాకబ్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :'దోషం తొలిగిస్తాడనుకుంటే కోరిక తీర్చమన్నాడు'