కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఆరోపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఏఐకేఎస్‌సీసీ సమావేశం నిర్వహించారు. స్వామినాథన్ కమిషన్‌ను పక్కనపెట్టి రైతులకు మేలు చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వాలు... రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని పేర్కొన్నారు.
'దేశవ్యాప్త నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయండి' - ఇల్లందులో ఏఐకేఎస్‌సీసీ సమావేశం
ఆగస్టు 9న చేపట్టబోయే దేశవ్యాప్త నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అఖిలపక్ష నాయకులకు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య విజ్ఞప్తి చేశారు. ఇల్లందులో ఏఐకేఎస్‌సీసీ సమావేశం నిర్వహించారు.
!['దేశవ్యాప్త నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయండి' aikscc meeting at yellandu bradri district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8322657-389-8322657-1596729141084.jpg)
దేశవ్యాప్త నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
ప్రభుత్వాల విధానాలను నిరస్తూ... దేశ వ్యాప్తంగా ఈనెల 9న తలపెట్టిన నిరసన కార్యక్రమానికి ప్రతి ఒక్కరు సంఘీభావం తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, తెదేపా, సీపీఎం నాయకులు పాల్గొన్నారు.