రాష్ట్ర వ్యాప్తంగా రేపు వ్యవసాయ సహకార సంఘం ఎన్నికలు జరగనున్నాయి. బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరుగుతుండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో మాత్రం చేతులు ఎత్తడం ద్వారా ఓటింగ్ నిర్వహించనున్నారు. ఎందుకంటే ఇక్కడ 50 మంది కంటే తక్కువ ఓటర్లు ఉండటం వల్ల బ్యాలెట్ విధానం కాకుండా చేతులెత్తి పద్ధతిలో ఎన్నికలు నిర్వహించనున్నారు.
అక్కడ చేతులు ఎత్తడమే.. బ్యాలట్ లేదు.. ఎందుకంటే? - Badradri kothagudem District
సాధారణంగా ఎన్నికలంటే బ్యాలెట్ పేపర్ ఉంటుంది. ఓటరు బ్యాలెట్ పేపర్‌పై ఉన్న గుర్తుకు ఓటేస్తారు. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో చేతులు ఎత్తడం ద్వారా ఓటింగ్ నిర్వహించనున్నారు.
వ్యవసాయ సహకార సంఘం
భద్రాచలం డివిజన్లోని చర్ల దుమ్ముగూడెంలో 13 స్థానాలకు 8 ఏకగ్రీవం కాగా ఐదు స్థానాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. చర్లలో 13 స్థానాలకు రెండు ఏకగ్రీవం కాగా 11 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. సత్యనారాయణపురంలో 13 స్థానాలకు రెండు ఏకగ్రీవం కాగా 11 స్థానాల్లో ఎన్నికలు జరనున్నాయి.
ఇదీ చూడండి:మరింత స్వేచ్ఛ ఇచ్చినప్పుడే కేంద్ర లక్ష్యం నెరవేరుతుంది : కేటీఆర్