అమెరికాలో హత్యను ఖండిస్తూ ఇల్లందులో నిరసన - justice for George Floyd
అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ హత్యను ఖండిస్తూ ఇల్లందులో న్యూడెమోక్రసీ నిరసన చేపట్టింది. యూఎస్‌లో ప్రజా ఉద్యమాలకు మద్దతుగా నిలవాలని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య పిలుపునిచ్చారు.
జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా భద్రాద్రిలో ఆందోళనలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో న్యూడెమోక్రసీ, ఇఫ్టూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. జార్జ్ ఫ్లాయిడ్ హత్యను ఖండిస్తూ.. దిష్టిబొమ్మ దహనం చేశారు. అమెరికాలో జరుగుతున్న ప్రజా ఉద్యమాలకు అన్నివర్గాలు అండగా నిలవాలని గుమ్మడి నర్సయ్య కోరారు. ఆందోళనలో పార్టీ నాయకులు అరుణ, ఆవునూరు మధు, సీతారామయ్య, తుపాకులు నాగేశ్వరరావు, సారంగపాణి, నరసింహారావు పాల్గొన్నారు.
- ఇదీ చూడండిఅమెరికాలో నిరసనల జ్వాలకు అధికారి బలి