భద్రాది కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో విషాదం జరిగింది. స్నేహితులతో కలిసి గోదావరినదిలో స్నానం చేసేందుకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు.
గోదావరిలో ఈతకువెళ్లి ప్రమాదవశాత్తు మృతి - kothagudem latest news
గోదావరినదిలో ఈతకు దిగిన యువకుడు ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో జరిగింది. స్నేహితులతో కలిసి సోమవారం గోదావరినదిలో ఈత కొట్టేందుకు వెళ్లిన చంటి ప్రమదవశాత్తు నీటమునిగి ప్రాణాలు కోల్పోయాడు.
గోదావరిలో ఈతకువెళ్లి ప్రమాదవశాత్తు మృతి
భద్రాచలం పట్టణానికి చెందిన ఐదుగురు యువకులు సోమవారం బూర్గంపాడు మండలం ఇరవెండి వద్ద స్నానం చేసేందుకు గోదావరి నదిలో దిగారు.
నదిలో ఈత కొడుతుండగా చంటి ప్రమాదవశాత్తు నీటమునిగాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు.