తెలంగాణ

telangana

ETV Bharat / state

CHEATING: ప్రేమ పేరుతో మోసం.. ప్రియుడి ఇంటి ముందు యువతి దీక్ష - a young woman protests at her lover house in palvancha

ప్రేమించాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ప్రియురాలు గర్భవతి అని తెలిసి.. పెళ్లికి నిరాకరించాడు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు.. ప్రియుడి ఇంటి ముందు దీక్ష చేపట్టింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఈ ఘటన చేసుకుంది.

LOVE CHEATING
ప్రేమ పేరుతో మోసం

By

Published : Aug 23, 2021, 1:18 PM IST

ప్రేమ పేరుతో మోసం చేసి, పెళ్లి చేసుకోమని అడిగితే చివరకు మొహం చాటేసిన ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు దీక్షకు దిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పాల్వంచ పరిధికి చెందిన యువతి.. సీతారామపట్నానికి చెందిన అరుణ్​ కుమార్​ రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అరుణ్​.. యువతికి శారీరకంగా దగ్గరయ్యాడు. కొన్ని రోజులకు తాను గర్భవతి అని తెలియడంతో పెళ్లి చేసుకోమని అడిగేసరికి మొహం చాటేశాడని బాధితురాలు వాపోయింది.

అంతకు ముందు ఇరు కుటుంబాల పెద్దలతో మాట్లాడించినా అతను పెళ్లికి ఒప్పుకోలేదని యువతి పేర్కొంది. న్యాయం చేయాలని కోరుతూ ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది. న్యాయం జరిగేవరకు అక్కడినుంచి కదిలేది లేదని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:VACCINE DRIVE: కొనసాగుతున్న ప్రత్యేక వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌

ABOUT THE AUTHOR

...view details