తెలంగాణ

telangana

ETV Bharat / state

మూలన పడేసిన వాహనానికి.. ట్రాఫిక్​ చలానా! అదెలా అంటే.. - కొత్తగూడెంలో వాహనం... హైదరాబాద్​లో చలానా

ఓ ద్విచక్ర వాహన యజమాని ట్రాఫిక్​ అధికారుల నుంచి వచ్చిన మెసేజ్​ చూసి అవాక్కయ్యాడు. అతని ఆశ్చర్యానికి కారణం అందులో వచ్చిన జరిమానా మొత్తం చూసి కాదు... రెండేళ్లుగా మూలన పడేసిన తన వాహనం ట్రాఫిక్​ నిబంధన ఉల్లంఘించడం ఏంటా అని.. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది.

మూలన పడేసిన వాహనానికి.. ట్రాఫిక్​ చలానా! అదెలా అంటే..
మూలన పడేసిన వాహనానికి.. ట్రాఫిక్​ చలానా! అదెలా అంటే..

By

Published : Jan 7, 2021, 12:21 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలానికి చెందిన మోతుకూరి మల్లికార్జునరావు చరవాణికి ట్రాఫిక్​ అధికారుల నుంచి ఓ సందేశం వచ్చింది. తన ద్విచక్రవాహనం ఏపీ 12 ఎఫ్​ 8371 పలుమార్లు హైదరాబాద్​లో ట్రాఫిక్​ నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను జరిమానా విధించినట్లు సందేశం వచ్చింది.

కొత్తగూడెంలో వాహనం... హైదరాబాద్​లో చలానా..

రెండేళ్లుగా వాడకుండా మూలనపడేసిన తన పల్సర్​ వాహనం 2019, 2020 డిసెంబర్​ 11,21 తేదీల్లో హైదరాబాద్​లోని పలు చోట్ల ట్రాఫిక్​ నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను.. రూ.605 జరిమానా విధించారు. టేకుల పల్లిలో తన ఇంట్లో ఉన్న వాహనానికి హైదరాబాద్​ నుంచి జరిమానా రావడం ఏంటని అవాక్కవడం తన వంతైంది. అయితే అదే నెంబరుతో హైదరాబాద్​లో మరో వ్యక్తి తిరుగుతున్నట్లు ట్రాఫిక్​ అధికారులు తీసిన చిత్రాలలో ఉంది. టేకులపల్లి గ్రామానికి చెందిన మూత రామాచారి వాహనానికి ఇల్లెందులో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్టు సందేశం రావడం వల్ల భయపడి జరిమానా కూడా చెల్లించాడు.

ఇదీ చూడండి:ఉద్యోగం రాలేదని.. ఊరికే ఉండిపోలేదు..

ABOUT THE AUTHOR

...view details