తెలంగాణ

telangana

ETV Bharat / state

నిరాడంబరంగా ఉంజల్ సేవా మహోత్సవం - భద్రచలం తాజా వార్తలు

భద్రాద్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా లక్ష్మణా సమేత సీతారాములకు ఉంజల్ సేవా మహోత్సవం నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా స్వామి వారికి సోమవారం వసంతోత్సవం నిరాడంబరంగా జరపనున్నారు.

unjal seva mahotsav, sita rama kalyanam at bhadrachalam
నిరాడంబరంగా ఉంజల్ సేవా మహోత్సవం

By

Published : Apr 25, 2021, 10:04 PM IST

భద్రాద్రి రామయ్య సన్నిధిలో వసంత పక్ష తీరు కల్యాణ బ్రహ్మోత్సవాలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం లక్ష్మణా సమేత సీతారాములకు బేడా మండపంలో ఉంజల్ సేవా నిర్వహించారు. ప్రధాన ఆలయంలోని లక్ష్మణా సమేత సీతారాములను బేడా మండపం వద్దకు తీసుకు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

భక్త రామదాసు రచించి ఆలపించిన కీర్తనలను హరిదాసులు స్వామివారి ముందు వినిపించారు. అనంతరం వేద పండితులు వేదమంత్రాలు పటిస్తూ ఉండగా, అర్చకులు ఉయ్యాలలో సేవలు అందుకుంటున్న స్వామివారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం స్వామి వారికి వసంతోత్సవం నిరాడంబరంగా జరగనుంది.

ఇదీ చూడండి :బొగ్గుకు ప్రత్యామ్నాయం...పంట వ్యర్థాల వినియోగం

ABOUT THE AUTHOR

...view details