భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జూలై 15న మణుగూరు మల్లెతోగు అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పుల ఘటన మరువక ముందే.. దాదాపు నెలన్నర రోజులకే అటవీ ప్రాంతంలో మళ్లీ తూటాపేలింది. ఈసారి మణుగూరు అటవీ ప్రాంతంలో కాకుండా.. మావోయిస్టులకు మరో కేంద్రంగా ఉన్న గుండాల అటవీ ప్రాంతంలో పోలీసు-మావోయిస్టుల తుపాకులు గర్జించాయి.
గుండాల మండలం దేవలగూడెం అటవీప్రాంతంలో పోలీసులు-మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందగా మరొకరు పరారయ్యారు. పరారైన మావోయిస్టు కోసం పోలీసులు అటవీ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగిస్తున్నారు. సంఘటనా స్థలంలో పోలీసులు ఓ ద్విచక్రవాహనంతోపాటు ఓ ఆయుధం స్వాధీనం
చేసుకున్నారు.
గుట్టల్లోకి పారిపోయేందుకు
రాష్ట్రంలోకి మావోయిస్టులు ప్రవేశించారన్న సమాచారం మేరకు దాదాపు 2 నెలలుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు ఏజెన్సీ ప్రాంతాలపై పూర్తిస్థాయిలో దృష్టిసారించారు. ఏజెన్సీ ప్రాంతంలో గస్తీ ముమ్మరం చేయడంతోపాటు విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మావోయిస్టు పార్టీకి చెందిన యాక్షన్ టీం కమాండర్ ఆధ్వర్యంలో కొంతమంది వ్యక్తులు గత మూడురోజులుగా దుబ్బగూడెం, లింగాల మామిడిగూడెం, దేవల్లగూడెం అటవీప్రాంతంలో సంచరిస్తున్నట్లు పోలీసులు సమాచారం అందుకున్నారు. ఈ మేరకు ప్రత్యేక పోలీసు బలగాలతో కూంబింగ్, వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి 9 గంటల నుంచి వాహనాల తనీఖీలు చేపట్టగా.. గురువారం తెల్లవారుజామున వాహన తనిఖీలు కొనసాగిస్తుండగా ద్విచక్రవాహనంపై ఇద్దరు అనుమానిత వ్యక్తులు దుబ్బగూడెం నుంచి దేవల్లగూడెం వైపు వెళ్తూ తారసపడ్డారు. వారిని విచారించేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటీ ద్విచక్రవాహనాన్ని ఆపకుండా దేవల్లగూడెం గ్రామ సమీపంలోకి వెళ్లిన తర్వాత.. తమ బలగాలపై కాల్పులు జరిపి గుట్టల్లోకి పారిపోయేందుకు ప్రయత్నించారని జిల్లా ఎస్పీ సునీల్ దత్ తెలిపారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపారన్నారు. తర్వాత చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించగా ఒకరు మృతదేహం లభ్యమైనట్లు ఎస్పీ తెలిపారు. మరో యాక్షన్ టీం
సభ్యుడు పారిపోయినట్లు ఎస్పీ పేర్కొన్నారు.
ముమ్మర కూంబింగ్
ఛత్తీస్గఢ్ నుంచి రాష్ట్రంలోకి మావోయిస్టులు ప్రవేశించారన్న సంకేతాలతో గత రెండు నెలలుగా భద్రాద్రి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలు, మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో పోలీసులు
ముమ్మర కూంబింగ్ చేపట్టారు. అనుమానిత ప్రాంతాలు, ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే జూలై 15న మణుగూరు మండలం
మల్లెతోగు అటవీ ప్రాంతంలో మావోయిస్టుల బృందం తారసపడగా ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఎదురుకాల్పుల్లో ఎవరూ ప్రాణాలు కోల్పోనప్పటికీ.. ఆ సంఘటన మావోయిస్టుల