సింగరేణి కాలరీస్ కంపెనీకి సంబంధించి 99వ వార్షిక జనరల్ బాడీ మీటింగ్ కొత్తగూడెం కార్పోరేట్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి... వాటికి ఆమోదం తెలిపారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆడిట్లో క్లీన్ చిట్ సాధించిన వార్షిక అకౌంట్సుకు వార్షిక సమావేశం ఆమోదం తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు 10 శాతం డివిడెంట్ ఇవ్వాలన్న బోర్డు ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు.
కొత్తగూడెంలో 99వ సింగరేణి వార్షిక జనరల్ బాడీ మీటింగ్ - కొత్తగూడెం వార్తలు
కొత్తగూడెంలో 99వ సింగరేణి వార్షిక జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. ఏడాదికోసారి జరిగే ఈ సమావేశంలో... బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో తీసుకొన్న నిర్ణయాలు, డివిడెంట్ చెల్లింపు, డైరెక్టర్ల జీతభత్యాల వంటి పలు అంశాలపై చర్చించి... వాటికి ఆమోదం తెలిపారు.
కొత్తగూడెంలో 99వ సింగరేణి వార్షిక జనరల్ బాడీ మీటింగ్
సింగరేణి సంస్థ ఎం.డీగా ఎన్.శ్రీధర్‌ను అదే హోదాలో కొనసాగే అంశంపై చర్చించిన సమావేశం... మెజారిటితో ఆమోదం తెలిపింది. ఇంధన శాఖ సహాయ కార్యదర్శి జి.ఎల్లయ్య, కేంద్ర బొగ్గు శాఖ అండర్ సెక్రటరీ శ్రీమతి అల్కా శేఖర్, సింగరేణి సంస్థ డైరెక్టర్ ఎస్.చంద్రశేఖర్ సహా పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదీ చూడండి:ఆరునెలల్లో ఖాళీలన్నీ భర్తీ చేస్తాం: సింగరేణి సీఎండీ శ్రీధర్