పండుగ రోజున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కరకవాగులో విషాదం చోటుచేసుకుంది. ఓవైపు గ్రామస్థులంతా హోలీ వేడుకల్లో మునిగి తేలుతున్నారు. అప్పటి వరకు స్నేహితులతో సంతోషంగా రంగులు చల్లుకుంటూ కేరింతలు కొట్టిన పిల్లలు... సమీపంలోని కేటీపీఎస్ కాలువకు స్నానానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు శివ అనే ఎనిమిదేళ్ల బాలుడు కాలువలో పడిపోయారు.
పండుగ పూట విషాదం... కాలువలో పడి చిన్నారి మృతి - CRIME NEWS IN BADRADRI
అప్పటి వరకు రంగులు పూసుకుంటూ... పిచికారి చేసుకుంటూ కళ్ల ముందే కేరింతలు కొట్టాడు. హోలీ ఆడి స్నానానికని సమీపంలోని కాలువకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలువలో మునిగి విగతజీవిగా తేలాడు. ఈ ఘటనతో పండుగ పూట గ్రామంలో విషాదం నిండింది.
![పండుగ పూట విషాదం... కాలువలో పడి చిన్నారి మృతి 8 YEARS BOY DEAD FELL IN TO CANAL AT KARAKAVAGU](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6346985-thumbnail-3x2-pppp.jpg)
8 YEARS BOY DEAD FELL IN TO CANAL AT KARAKAVAGU
గమనించిన తోటి పిల్లలు వెంటనే గ్రామస్థులకు విషయం చేరవేశారు. హుటాహుటిన కాలువకు వెళ్లి కాపాడేందుకు ప్రయత్నించినా... ఫలితం లేకపోయింది. కాసేపటి ముందు వరకూ కేరింతలు కొట్టిన తమ పిల్లాడు విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
పండుగ పూట విషాదం... కాలువలో పడి చిన్నారి మృతి