పాపం పండిందిలా
పక్కా మోసం - froud
ప్రభుత్వ కొలువులు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు వలపన్నారు. డిగ్రీ పాసైన విద్యార్థుల నుంచి సుమారు రూ.56 లక్షలు వసూలు చేశారు. చివరకు పోలీసులకు అడ్డంగా దొరికిపోయి కటకటాలపాలయ్యారు.
డబ్బులిచ్చి ఎంతకాలమైనా ఉద్యోగం రాకపోవడంవల్ల అనుమానమొచ్చిన యువకులు నిందితులిద్దరిపై భద్రాచలం ఠాణాలో ఫిర్యాదు చేశారు.
దర్యాప్తు చేపట్టిన పోలీసులు... నిందితులు సోయం ప్రసాద్, చర్ల నాగేంద్ర ప్రసాద్ హైదరాబాద్ వెళ్తుండగా బస్టాండులో కాపుకాసి చాకచక్యంగా పట్టుకున్నారు. వారి నుంచి రెండు కార్లు, విద్యార్థుల ధ్రువపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వీరికి సహకరించిన మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. వారిని తొందరలోనే పట్టుకుంటామని భద్రాచలం సీఐ సత్యనారాయణ రెడ్డి తెలిపారు.