సాధారణంగా 5 నుంచి 6 అడుగుల ఎత్తున్న వ్యక్తులను చూసుంటారు. కానీ 7.5 అడుగుల ఎత్తున్న వ్యక్తిని ఎప్పుడైనా చూశారా.. అలాంటి వ్యక్తిని చూస్తే మనకు ఒకింత ఆశ్చర్యం కలగక మానదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో వరదల నేపథ్యంలో విధుల కోసం వచ్చిన ఓ జవాన్ ఏకంగా ఏడున్నర అడుగుల ఎత్తు ఉండటంతో స్థానికులు ఆయనను ప్రత్యేకంగా చూస్తున్నారు. ఆయనతో సెల్ఫీలు దిగుతూ.. సంబుర పడిపోతున్నారు.
ఈ జవాన్ ప్రభాస్‌కే అన్నలాంటోడు.. చూస్తే తలెత్తుకోవాల్సిందే!
ఎత్తు విషయంలో ఎవరినైనా విమర్శించాలన్న.. సమర్థించాలన్న నార్మల్‌గా హీరో ప్రభాస్‌తో పోలుస్తాం. ఎందుకంటే ప్రభాస్ అంత 'హైట్' ఉంటాడు మరి. అలాంటిది ఓ జవాన్ ప్రభాస్‌నే మించేలా ఉన్నాడు. ప్రభాస్ 'సిక్స్ ఫీట్' ఉంటే.. ఈ జవాన్ అంతకు మించి ఉన్నాడు. అసలు ఈ జవాన్ ఎవరు.. మధ్యలో ప్రభాస్ ఎందుకొచ్చాడు అనుకుంటున్నారా.. అయితే ఈ స్టోరీ చదివేయండి.
ఈ జవాన్ ప్రభాస్‌కే అన్నలాంటోడు.. చూస్తే తలెత్తుకోవాల్సిందే!
జమ్మూ రాష్ట్రానికి చెందిన సాయిల్.. ఆర్మీలో జవాన్‌గా పని చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఉంటున్న ఆయన.. వరదల నేపథ్యంలో ప్రత్యేక విధుల కోసం భద్రాచలం వచ్చారు. ఈ క్రమంలోనే స్థానికులు ఆయనతో స్వీయ చిత్రాలు, ఫొటోలు దిగుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Last Updated : Jul 26, 2022, 10:21 AM IST