భదాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోదావరి కాస్త శాంతించింది. శుక్రవారం వరకు 52.5అడుగులకు పెరిగిన గోదావరి నీటిమట్టం రాత్రి నుంచి స్వల్పంగా తగ్గుతూ వస్తోంది. ఈ ఉదయం ఆరు గంటలకు 52.5అడుగుల వద్ద ప్రవహిస్తోంది.
శాంతించిన గోదారమ్మ... 52.5 అడుగులకు చేరిన నీటిమట్టం - Decreased Godavari latest news
వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉప్పొంగిన గోదావరి శనివారం శాంతించింది. భద్రాచలం వద్ద వరద 52.5 అడుగులకు చేరడం వల్ల స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది.
![శాంతించిన గోదారమ్మ... 52.5 అడుగులకు చేరిన నీటిమట్టం 53.2 feets Decreased Godavari water level at Bhadrachalam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8512553-10-8512553-1598068389172.jpg)
శాంతించిన గోదారమ్మ
సుమారు రెండు అడుగుల మేర తగ్గడం వల్ల స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇంకా మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 52.5అడుగుల కంటే తగ్గితే అధికారులు ఈ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకోవాలన్నారు. గోదావరి ఉద్ధృతికి భద్రాచలంలోని ఏజెన్సీ మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
ఇవీచూడండి:పులిచింతల వైపు కృష్ణమ్మ పరుగులు
Last Updated : Aug 22, 2020, 2:33 PM IST