Maoist surrender: 53 మంది మావోయిస్టు సానుభూతిపరులు లొంగుబాటు
14:12 September 09
53 మంది మావోయిస్టు సానుభూతిపరులు లొంగుబాటు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎత్తున మావోయిస్టు సానుభూతిపరులు లొంగిపోయారు. మావోయిస్టు సానుభూతిపరులుగా, మిలీషియా సభ్యులుగా, గ్రామ కమిటీ సభ్యులుగా పనిచేస్తున్న 53 మంది ఎస్పీ సునీల్‌దత్, సీఆర్పీఎఫ్ కమాండెంట్ ఎదుట లొంగిపోయారు.
లొంగిపోయిన వారు చర్ల మండలంలోని పూసగొప్ప, బత్తినపల్లి, బట్టిగూడెం, చెన్నాపురం గ్రామాల వారని అధికారులు వెల్లడించారు. వీరిలో ఐదుగురు మహిళలు కూడా ఉన్నారు. మావోయిస్టులంతా.. వారి సిద్ధాంతాలను వదిలిపెట్టి పోలీసుల ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని ఎస్పీ సునీల్‌దత్ సూచించారు.
ఇదీ చూడండి:ఎన్నికల ముందు కలకలం.. అసెంబ్లీ వెబ్సైట్ హ్యాక్!