భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆంధ్రప్రదేశ్-తెలంగాణ సరిహద్దు వద్ద 5 గ్రామాల ప్రజలు ధర్నాకు దిగారు. కన్నాయిగూడెం, పిచుకలపాడు, గుండాల, పురుషోత్తపట్నం, ఏటపాక గ్రామాల ప్రజలు.. భద్రాచలం శివారులో రోడ్డుపై వాహనాలు నిలిపివేసి ఆందోళన చేపట్టారు. ఏపీలో ఉన్న తమ 5 గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలంటూ డిమాండ్ చేశారు. ఆందోళనకారులకు కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య సంఘీభావం తెలిపారు.
'ఆ 5 గ్రామాలు తెలంగాణలో కలపాల్సిందే..' - ap people protest news
భద్రాద్రి జిల్లా ఏపీ-తెలంగాణ సరిహద్దు వద్ద పలు గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న తమ గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలంటూ ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న ఇరు రాష్ట్రాల పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఏపీ-తెలంగాణ సరిహద్దు వద్ద ఏపీ వాసుల ధర్నా.. అందుకోసమేనటా..!
విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీసులు భారీగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అక్కడే భారీగా మోహరించారు.
Last Updated : Jul 24, 2022, 1:19 PM IST