భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రుద్రంపూర్ గ్రామంలో 40 మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో అనారోగ్యం పాలయ్యారు. సింగరేణి ఫిల్టర్ బెడ్ నుంచి సరఫరా అయిన మంచినీరు కలుషితమైన కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని అధికారులు భావిస్తున్నారు. అస్వస్థతకు గురైన వారికి ఇంటి వద్దనే చికిత్స అందిస్తున్నారు. కొందరిని సింగరేణి వైద్యశాలకు తరలించారు. రుద్రంపూర్‌లోని నాలేరియా, గోపు ఏరియా తదితర ప్రాంతాల్లో ఈ పరిస్థితి నెలకొంది.
కలుషిత నీరు తాగి 40 మందికి అస్వస్థత - కలుషిత నీరు తాగి 40 మందికి అస్వస్థత
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రంపూర్ గ్రామంలో కలుషిత నీటిన తాగి 40మంది అస్వస్థతకు గురయ్యారు. సింగరేణి ఫిల్టర్ బెడ్ నుంచి సరఫరా అయిన నీరు కలుషితమై ఈ పరిస్థితి ఏర్పడిందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం బాధితులు చికిత్స పొందుతున్నారు.
రుద్రంపూర్, కలుషిత నీరు తాగి అస్వస్థత
మంచి నీటి పైప్‌కు లీకేజీల కారణంగా కలుషిత నీరు నీటిలో చేరి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఆ నమూనాలను పరీక్షల నిమిత్తం సింగరేణి ల్యాబ్, వరంగల్ ల్యాబ్‌కు పంపించారు.