తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఆర్పీఎఫ్ క్యాంప్ ఆఫీస్​ సమీపంలో 204 కేజీల భారీ గంజాయి పట్టివేత - సుమారు రూ.30 లక్షల అరవై వేలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 204 కేజీల భారీ గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భద్రాచలంలోని సీఆర్పీఎఫ్ క్యాంప్ సమీపంలో పెట్రోలింగ్ చేస్తుండగా ఓ కారులో పెద్ద మెుత్తంలో గంజాయి పట్టుబడినట్లు పోలీసులు వెల్లడించారు.

సీఆర్పీఎఫ్ క్యాంప్ ఆఫీస్​ సమీపంలో 204 కేజీల భారీ గంజాయి పట్టివేత
సీఆర్పీఎఫ్ క్యాంప్ ఆఫీస్​ సమీపంలో 204 కేజీల భారీ గంజాయి పట్టివేత

By

Published : Aug 9, 2020, 8:04 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 204 కేజీల భారీ గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భద్రాచలంలోని సీఆర్పీఎఫ్ క్యాంప్ సమీపంలో ఎస్​ఐ మహేశ్ పెట్రోలింగ్ చేస్తుండగా ఓ కారులో పెద్ద మెుత్తంలో గంజాయి పట్టుబడినట్లు సీఐ వినోద్​రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలోని భద్రాచలం మీదుగా గంజాయిని హైదరాబాద్​కు తరలిస్తుండగా భద్రాచలంలో పట్టుకున్నట్లు సీఐ వెల్లడించారు. గంజాయి రవాణా చేస్తున్న మహబూబాబాద్​కు చెందిన ఓ యువకుడ్ని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.30 లక్షల అరవై వేలు ఉంటుందని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details