తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న 200 కేజీల గంజాయి పట్టివేత - 200 కేజీల గంజాయిని భద్రాచలం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు

ఆంధ్రప్రదేశ్, ఒడిషా, ఛత్తీస్​గఢ్​ రాష్ట్రాల నుంచి సరిహద్దుల ద్వారా తెలంగాణలోకి అక్రమంగా రవాణా చేస్తున్న 200 కేజీల గంజాయిని భద్రాచలం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.

200kgs of marijuana seized by bhadrachalam police
అక్రమంగా తరలిస్తున్న 200 కేజీల గంజాయి పట్టివేత

By

Published : Jul 26, 2020, 10:58 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మీదుగా ఒడిషా నుంచి హైదరాబాద్​కు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. భద్రాచలంలోని ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తుండగా ఒక కారు అనుమానాస్పదంగా కనిపించడం వల్ల ఎస్సై మహేశ్​ సోదా చేశారు.

కారులో అక్రమంగా తరలిస్తున్న 200 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కారును సీజ్​ చేసి.. ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. దాని విలువ సుమారు 30 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

ఇవీ చూడండి:శరవేగంగా వైరస్​ వ్యాప్తి‌.. మూడు వారాల్లోనే మూడు రెట్లు పెరిగిన కేసులు

ABOUT THE AUTHOR

...view details