తెలంగాణ

telangana

ETV Bharat / state

2 లక్షల రూపాయల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం - Gutka packets seized at kothagudem

కొత్తగూడెం జిల్లా వినోభానగర్‌ చెక్‌పోస్టు వద్ద రూ.2 లక్షల 20 వేల విలువైన గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ గుట్కా సంచులను తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

2 lakh seized packets of Gutka at kothagudem
2 లక్షల రూపాయల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

By

Published : Apr 16, 2020, 8:22 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వినోభానగర్‌ చెక్‌పోస్టు వద్ద రూ.2 లక్షల 20 వేల విలువైన గుట్కా ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. ఖమ్మం- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇండికా కారులో తరలిస్తున్న గుట్కా సంచులను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

కారుతోపాటు పాల్వంచ మండలం పాండు రంగాపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ నాగరాజు పర్యవేక్షణలో ఎస్సై శ్రీకాంత్‌ కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి :చెయ్యి పైకి లేచిందో... అలారం మోగుద్ది

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details