సింగరేణి సంస్థలో త్వరలో 177 క్లరికల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనుందని ఆ సంస్థ డైరెక్టర్(పా) ఎన్.బలరాం తెలిపారు (singareni job notification soon). సోమవారం కొత్తగూడెంలోని ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలాంటి అక్రమాలు, ఆరోపణలకు తావులేకుండా రాత పరీక్షను పారదర్శకంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
singareni job notification soon: 177 క్లరికల్ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ - తెలంగాణ తాజా వార్తలు
నిరుద్యోగులకు సింగరేణి సంస్థ (singareni) గుడ్న్యూస్ చెప్పింది. తర్వలో 177 క్లరికల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడుతుందని ఆ సంస్థ డైరెక్టర్ (పా) ఎన్.బలరాం తెలిపారు (job notification soon).
singareni
గతేడాది సింగరేణి సంస్థ సాధించిన నికర లాభం వివరాలను ఈ నెల 25న నిర్వహించనున్న బోర్డు సమావేశంలో ప్రకటించే అవకాశముందన్నారు. లాభాల్లో కార్మికుల వాటా విషయమై ముఖ్యమంత్రి, సంస్థ సీఎండీ దసరా లోపు నిర్ణయం తీసుకుంటారని వివరించారు. బొగ్గు విక్రయ బకాయిలపై బలరాం స్పందిస్తూ.. వారం లోగా బకాయిలను చెల్లించకుంటే ఏడున్నర శాతం వడ్డీ విధిస్తామని, ఈ రూపంలో సంస్థకు ఏటా రూ.100 కోట్లు అదనంగా లభిస్తుందన్నారు.
ఇదీ చూడండి:Singareni CMD: ప్రాజెక్టుల ప్రగతిపై ప్రతి నెలా సమీక్ష