భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతా రామచంద్ర స్వామి వారిని 150 మంది భక్తులు పాదయాత్రగా వచ్చి దర్శించుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నుంచి కాలినడకన వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. గత తొమ్మిదేళ్లుగా ప్రతి ఏటా పాదయాత్రగా వచ్చి స్వామి వారిని దర్శించుకుంటామని వారు తెలిపారు. ఇలా దర్శించుకోవడం వల్ల సకల శుభాలు కలుగుతాయని నమ్ముతున్నట్లు భక్తులు పేర్కొన్నారు.
భద్రాద్రికి కాలినడకన 150 మంది కాకినాడ భక్తులు - భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయం
భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి వారిని దర్శించుకోడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి భక్తులు తరలివచ్చారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నుంచి కాలినడకన వచ్చి స్వామి వారి దర్శనం చేసుకున్నారు.
భద్రాద్రికి కాలినడకన 150 మంది కాకినాడ భక్తులు