భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని మసివాగు గ్రామశివారులో లారీలో అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న రేషన్ బియ్యాన్ని పోలీసులు, రెవెన్యూ అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. బియ్యాన్ని అధికారులు పట్టుకోగా లారీడ్రైవర్, క్లీనర్ పరారయ్యారు.
వంద క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత - పీడీఎస్ బియ్యం పట్టివేత
అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా లారీలో ఉన్న వంద క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మసివాగు గ్రామశివారులో రెవెన్యూ అధికారులు, పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

100 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
లారీలో సుమారు వంద క్వింటాళ్ల బియ్యం ఉన్నట్టు డిప్యూటీ తహసీల్దార్ ముత్తయ్య తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు. గత కొంతకాలంగా ఇల్లందు మండలంలో అక్రమ బియ్యం రవాణాపై కఠిన చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యం నిల్వ చేసినా, అమ్మినా, కొనుగోలు చేసినా నేరమని తెలిపారు
ఇవీ చూడండి: మూర్ఛతో చెరువులో పడి యువకుడు మృతి