తెలంగాణ

telangana

ETV Bharat / state

మోదుగుపూలతో హోలీ కేళీ..! - తెలంగాణ వార్తలు

హోలీ అనగానే వివిధ రంగులు చల్లుకోవడం అందరికీ తెల్సిందే. ఒకప్పుడు ఈ పండుగను మోదుగ పూలతో ప్రత్యేకంగా తయారు చేసిన రంగులతో చల్లుకుంటూ జరుపుకునేవారు. ఈ కరోనా కష్టకాలంలో మళ్లీ పాత పద్ధతివైపే మొగ్గు చూపారు ఆదిలాబాద్ జిల్లా దేవాపూర్ యువతులు. మోదుగు పూలను కోసి.. వాటితో సహజసిద్ధమైన రంగులు తయారు చేశారు. అవి ఎలా చేశారో చూడండి మరి!

natural colours for holi, holi festival 2021
హోలీ స్పెషల్, ఆదిలాబాద్ హోలీ స్పెషల్

By

Published : Mar 27, 2021, 8:02 PM IST

కరోనా నేపథ్యంలో ఏ రంగు చల్లితే ఏమవుతుందో అనే భయంతో యవతులు సహజ రంగులపై దృష్టిసారించారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం దేవాపూర్ శివారులో ప్రకృతి సహజ సిద్ధంగా ఉన్న మోదుగు పూలను కొంత మంది యువతులు తీసుకొచ్చి హోలీ కోసం ప్రత్యేకంగా రంగు తయారు చేశారు.

మోదుగు పూలను సేకరిస్తున్న యువతులు

హోలీ పండగ కంటే రెండు రోజుల ముందుగానే ఆ పూలను తీసుకొచ్చి నీటిలో నిల్వ ఉంచుతున్నారు. ఆ తర్వాత వాటిని మరిగించి, దంచారు.

నీటిలో మరిగించి..

ఇలా సహజసిద్ధమైన రంగులను తయారు చేశారు. ఈ పద్ధతి పలు గిరిజన ప్రాంతాల్లో ఏళ్ల నుంచి ఆనవాయితీగా వస్తున్నాయని వారు తెలిపారు.

సహజసిద్ధమైన రంగు తయార్

రసాయనాలతో కూడిన రంగులు వాడటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్న ఉద్దేశంతో వీటికి దూరంగా సహజ రంగులను వాడుతున్నామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:హోలీ ఆడేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

ABOUT THE AUTHOR

...view details